“సలార్” డిస్ట్రిబ్యూటర్స్ కి రవితేజ హిట్ రీరిలీజ్ హక్కులు

“సలార్” డిస్ట్రిబ్యూటర్స్ కి రవితేజ హిట్ రీరిలీజ్ హక్కులు

Published on Feb 13, 2024 3:12 PM IST


ప్రస్తుతం మన టాలీవుడ్ సినిమా దగ్గర రీ రిలీజ్ ల ట్రెండ్ ఎలా మారిందో చూస్తూనే ఉన్నాం. ఇక రీసెంట్ గానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “కెమెరామెన్ గంగతో రాంబాబు” రీ రిలీజ్ కి రాగా ఈ చిత్రం తర్వాత రేపు వాలెంటైన్స్ డే కానుకగా చాలా ప్రేమకథా చిత్రాలు థియేటర్స్ లో రీ రిలీజ్ కి వస్తున్నాయి. ఇక వీటి తర్వాత మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన బిగ్ హిట్ చిత్రం “కిక్” కూడా రీ రిలీజ్ కి సిద్ధం అయ్యింది.

లేటెస్ట్ గానే ఈగల్ తో హిట్ కొట్టిన రవితేజ మళ్ళీ మార్చ్ 1 న అయితే కిక్ సినిమాతో థియేటర్స్ లో ఆడియెన్స్ ని పలకరించనున్నాడు. అయితే ఇంట్రెస్టింగ్ గా ఈ చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సొంతం చేసుకోవడం విశేషం. నైజాం మార్కెట్ లో సలార్ తో భారీ వసూళ్లు అందుకున్న తాము ఇప్పుడు ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. మరి ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా ఇలియానా హీరోయిన్ గా నటించింది. అలాగే థమన్ మ్యూజిక్ అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు