నార్త్ లో కూడా “సలార్”దే హవా..?

నార్త్ లో కూడా “సలార్”దే హవా..?

Published on Dec 8, 2023 10:20 PM IST


పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ “సలార్” కోసం ఆడియెన్స్ ఎలా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. మరి ఈ చిత్రం నుంచి మరిన్ని సాలిడ్ ట్రీట్ లు రాబోతుండగా ఆల్రెడీ హిందీ సహా మన తెలుగు మరియు ఓవర్సీస్ మార్కెట్ సాలిడ్ బజ్ ని ఈ సినిమా సెట్ చేసుకుంది.

అయితే ఇంట్రెస్టింగ్ గా నార్త్ లో కూడా గట్టి పోటీ ఉన్నప్పటికీ మేజర్ గా “సలార్” పైనే అందరి ఆసక్తి ఉన్నట్టుగా తెలుస్తుంది. షారుఖ్ ఖాన్ నటించిన “డంకి” కూడా రేస్ లో ఉన్నప్పటికీ సలార్ మాస్ చిత్రం కాబట్టి దానికన్నా సలార్ బిజినెస్ నే ఎక్కువ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. డిస్ట్రిబ్యూటర్స్ కూడా సలార్ కి కాస్త ప్రియారిటీ ఇస్తున్నారట. మరి దీనితో అయితే నార్త్ లో కూడా సలార్ డామినేషన్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరి అసలైన మాస్ అయితే ఈ డిసెంబర్ 22 నుంచి షురూ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు