డిజిటల్ ప్రీమియర్ కి రెడీ అయిన “సలార్”

డిజిటల్ ప్రీమియర్ కి రెడీ అయిన “సలార్”

Published on Jan 16, 2024 2:15 PM IST


రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ చిత్రం యొక్క డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫారం అయిన నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రం ఈ సంక్రాంతి నుండి డిజిటల్ ప్రీమియర్ గా ఆడియెన్స్ కి అందుబాటులో ఉంటుంది అని అంతా భావించారు. అయితే ఈ సినిమా ఫిబ్రవరి 4, 2024 నుండి అందుబాటులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో పృథ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు