పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రంపై అయితే ఓఆన్ ఇండియా ఆడియెన్స్ లో ఓ రేంజ్ అంచనాలు నెలకొనగా మేకర్స్ రీసెంట్ గా ఒకొక్క రాష్ట్రానికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సంస్థల్ని రివీల్ చేస్తుండగా ఇప్పుడు అవైటెడ్ నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ సంస్థని అయితే మేకర్స్ రివీల్ చేశారు.
మరి దీనితో ఈ చిత్రాన్ని ప్రముఖ సంస్థ ఏఏ ఫిల్మ్స్ వారు గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేసారు. మరి దీనితో అయితే నార్త్ ఇండియా లో సలార్ ఆగమనం గ్రాండ్ లెవెల్లో ఉంటుంది అని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందిస్తుండగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.
Thrilled to announce our collaboration with @AAFilmsIndia (#AnilThadani) to present #SalaarCeaseFire in ???????????????????? ???????????????????? territories.#Salaar Trailer on Dec 1st at 7:19 PM ????#Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @hombalefilms @VKiragandur @IamJagguBhai… pic.twitter.com/ykmKFKUze0
— Salaar (@SalaarTheSaga) November 18, 2023
