యూఎస్ లో “సలార్” రికార్డ్ బుకింగ్స్.!

యూఎస్ లో “సలార్” రికార్డ్ బుకింగ్స్.!

Published on Dec 10, 2023 9:00 AM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం రిలీజ్ సమయం అంతకంతకు దగ్గర పడుతుంది. దీనితో అంచనాలు మరింత పెరుగుతూ వెళ్తున్నాయి.

ఇక ఈ సినిమాకి యూఎస్ మార్కెట్ లో కూడా ఎప్పటి నుంచో భారీ హైప్ నెలకొనగా అక్కడ ఇప్పుడు ఈ సినిమా హైప్ కి తగ్గట్టుగా రికార్డ్ బుకింగ్స్ సెట్ చేస్తుంది. మరి ఇంకా రిలీజ్ కి 10 రోజులకి పైగా సమయం ఉండగా ఈ సినిమా అప్పుడే అక్కడ హాఫ్ మిలియన్ మార్క్ ని జస్ట్ బుకింగ్స్ తోనే క్రాస్ చేసేసింది.

దీని బట్టి యూఎస్ మార్కెట్ లో సలార్ క్రేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందిస్తుండగా హోంబళే ఫిల్మ్స్ వారు భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు