బాలీవుడ్ లో సల్లూ భాయ్ కి ఉన్న ఫాలోయింగే వేరు. ఆయన సినిమా విడుదలైంది అంటే థియేటర్లలో వసూళ్ల వర్షమే. ఇక సల్మాన్ నటించిన తాజా చిత్రం దబంగ్ 3 కూడా రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తుంది. గత వారం విడుదలైన ఈ చిత్రం అప్పుడే వంద కోట్ల వసూళ్ల మార్కుని దాటేసింది. నిజానికి దబంగ్ 3 చిత్రానికి క్రిటిక్స్ దారుణమైన రేటింగ్స్ ఇచ్చారు. అయినప్పటికీ అవేవీ సల్మాన్ ని ఆపలేకపోతున్నాయి. నాలుగు భాషలలో పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ చిత్రం అన్ని భాషలలో కలిపి ఇప్పటివారు 119.55 కోట్ల వసూళ్లు రాబట్టింది. అసలు వంద కోట్లు అంటే సల్మాన్ సినిమాలు అవలీలగా దాటేస్తున్నాయి.
ఇక ప్రముఖ కొరియోగ్రాఫర్ మరియు హీరో ప్రభుదేవా ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా సోనాక్షి సిన్హా, సాయి మంజ్రేకర్ హీరోయిన్స్ గా నటించారు. ప్రముఖ కన్నడ స్టార్ కిచ్చా సుధీప్ దబంగ్ 3 సినిమాలో ప్రతినాయకుడి పాత్ర చేశారు. కాగా సల్మాన్ తదుపరి చిత్రం రాధే కి కూడా దర్శకుడిగా ప్రభుదేవా వ్యవహరించడం గమనార్హం.


