వరుస చిత్రాలు ప్రకటిస్తూ సల్మాన్ తన ఫామ్ కొనసాగిస్తున్నారు. దబాంగ్ 3 చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేసిన సల్మాన్ ఖాన్ వచ్చే ఏడాదికి గానూ మరో మూవీని రెడీ చేశారు. ప్రతి ఏడాది ఈద్ కానుకగా ఓ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ విడుదల చేస్తారు. ఈ ఏడాది ఆయన భారత్ అనే చిత్రాన్ని విడుదల చేయడం జరిగింది. కాగా వచ్చే రంజాన్ కానుకగా ‘రాధే’ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు సల్మాన్ ఖాన్ కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో సల్లూ భాయ్ కి జంటగా యంగ్ బ్యూటీ దిశా పటాని నటిస్తుంది. నేడు ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ముంబైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ఇక ప్రస్తుతం సల్మాన్ దబాంగ్ 3 మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. దబాంగ్ 3 చిత్రానికి కూడా ప్రభుదేవానే దర్శకత్వం వహించడం విశేషం. ఈ మూవీని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల చేస్తున్నారు. దబాంగ్ 3 మూవీలో సల్మాన్ కి విలన్ గా కన్నడ స్టార్ సుదీప్ నటిస్తున్నారు. ఇక సోనాక్షి సిన్హా, సాయి మంజ్రేకర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీపై బాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. దబాంగ్ 3 చిత్రాన్ని హిందీతో పాటు సౌత్ లాంగ్వేజెస్ లో కూడా విడుదల చేస్తున్నారు.


