రచయితగా మారిన బాలీవుడ్ కండల వీరుడు.!

Published on Jun 3, 2020 6:01 pm IST


తన సినిమాలు హిట్ అయితే ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కొత్త లెక్కలు పరిచయం చేస్తాడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. నటుడిగానే కాకుండా ఎందరో నిస్సహాయులకు అండగా నిలిచి మరింత పేరు పొందాడు సల్లూ భాయ్.

పాత్రకు తగ్గట్టుగా తన బాయ్ లాంగ్వేజ్ ను మార్చుకునే సల్మాన్ లో కేవలం నటన మాత్రమే కాకుండా మరికొన్ని ఇతర కోణాలు కూడా ఉన్నాయి. పాటలు పాడడం పెయింటింగ్ వెయ్యడంతో పాటుగా సల్మాన్ ఖాన్ ఇప్పుడు ఈ లాక్ డౌన్ సమయాన్ని పేపర్ పై వినియోగిస్తున్నారట.

ఈ ఖాళీ సమయంలో కూర్చొని సల్మాన్ ఖాన్ ఒక లవ్ స్టోరీని రాసారని తెలుస్తుంది. అలాగే ఆ చిత్రాన్ని సల్మానే నిర్మించనున్నారని టాక్. మొత్తానికి ఈ లాక్ డౌన్ సమయంలో చాలా మంది నటుల్లో కొత్త కోణాలు బయట పడ్డాయని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More