“బాహుబలి” క్రేజీ ప్రశ్నకు ఆన్సర్ సల్మాన్ కి ఇంకా తెలియదంట

Published on May 29, 2019 12:48 pm IST

సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ఆయన నటించిన “భరత్” అనే మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న సల్మాన్ బాహుబలి మూవీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . ఓ విలేకరి సల్మాన్‌ను ప్రశ్నిస్తూ.. ‘మీరు ‘బాహుబలి: ది బిగినింగ్‌’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ సినిమాలు చూశారా?’అని అడిగారు.

దానికి సమాధానంగా ‘నేను ‘బాహుబలి: ది బిగినింగ్‌’ మాత్రమే చూశాను. రెండో భాగం చూడలేదు. అందుకే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో నాకు ఇప్పటికీ తెలీదు. అసలు రెండో భాగంలో ఏం జరిగిందో కూడా నాకు తెలీదు’ అని చమత్కరించారు సల్మాన్‌.

ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ సంపాదించుకున్న చిత్రం ‘బాహుబలి’ సినిమా కలెక్షన్స్ అప్పటివరకు ఉన్న ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డు లను చెరిపివేసాయి. అలాంటి బ్లాక్ బస్టర్ మూవీని సల్మాన్ చూడలేదనడం ఒకింత ఆశ్చర్యం కలిగించే అంశమే. సల్మాన్ కత్రినా , దిశా పటాని కంబినేషన్లో అలీ అబ్బాస్ జఫ్ఫార్ దర్శకత్వంలో తెరకెక్కిన “భరత్” మూవీ రంజాన్ కానుకగా జూన్ 7 న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More