
సినీ పరిశ్రమలో ఒక భాషలో విజయం సాధించిన సినిమాని మరో భాషలో రీమేక్ చెయ్యడం అనేది చాలా కామన్ గా జరిగే విషయం. కథలో వారి భాషకి బాగా సరిపోయే కంటెంట్ ఉంటే చాలా ఆ సినిమాని రీమేక్ చేసేస్తారు. ఈ మధ్య కాలంలో తెలుగులోని చాలా హిట్ సినిమాలు బాలీవుడ్ కి వెళ్లి అక్కడ చాలా పెద్ద విజయాలను నమోదు చేసాయి. ప్రస్తతం టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సినిమా ‘శ్రీమంతుడు’. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కోరల శివ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా 12 రోజుల క్రితం రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీసు వద్ద సూపర్ కలెక్షన్స్ ని వసూలు చేస్తోంది.
తాజాగా విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం శ్రీమంతుడు సినిమా రీమేక్ రైట్స్ కోసం బాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ వారు మైత్రి మూవీ మేకర్స్ వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ వారు శ్రీమంతుడు సినిమా రీమేక్ కోసం బాలీవుడ్ కింగ్ ఖాన్ సల్మాన్ ఖాన్ తో చర్చలు జరుపుతున్నారు. సల్మాన్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే రీమేక్ రైట్స్ తీసుకోవడానికి సిద్దమవుతున్నాడు. ఈ సినిమాపై సల్మాన్ ఖాన్ ఆసక్తిగానే ఉన్నా ఇంకా ఫైనల్ సిగ్నల్ ఇవ్వలేదు. అందుకే ఇంకా నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.
మనం పుట్టిన ఊరిని మరచిపోకూడదు, అవసరం అయితే ఆ ఊరిని దత్తత తీసుకొని మరీ బాగు చెయ్యాలి అనే సోషల్ మెసేజ్ పక్కా కమర్షియల్ యాంగిల్ లో చెప్పిన సినిమా ‘శ్రీమంతుడు’. ఈ సినిమా బాలీవుడ్ కి కూడా బాగా సెట్ అవుతుంది. కావున సల్మాన్ ఖాన్ రీమేక్ చేస్తారనే ఆశించవచ్చు.

