సామజవరగమనా సాంగ్: యువతను ఉపేయడం ఖాయం

Alav

అలవైకుంఠపురంలో సామజవరగమనా సాంగ్ కొద్దిసేపటి క్రితం విడుదల చేయడం జరిగింది. “నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు…,ఆ చూపులనాల్లా తొక్కుకువెళ్లకు దయలేదా అసలు…, అని సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన అందమైన చరణాలతో మొదలైన మెలోడీ సాంగ్ మనసుకు హత్తుకునేలా సాగింది. ప్రియురాలి చూపుకోసం సున్నితంగా వేడుకుంటున్న ప్రియుడి విరహవేదనను వివరించేలా రాసిన సిరివెన్నెల సాహిత్యానికి థమన్ క్లాసిక్ మరియు వెస్ట్రన్ మ్యూజిక్ కలబోతతో రూపొందించిన స్వరాలు పాటను ఓ స్థాయికి తీసుకెళ్లాయి. మంచి సాహిత్య, సంగీతాలకు సిద్ధ్ శ్రీరామ్ స్వరం తోడొవ్వడంతో ఈ పాట మధురంగా మారింది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో నివేదా పేతురాజ్, సుశాంత్, నవదీప్,టబు కీలక పాత్రలు పోస్తుండగా, హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్ మరియు గీతా ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మితమవుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదల కానుంది.

పాట కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version