బన్నీ సినిమాలో ఒక్క పాట కోసం అంత ఖర్చు పెట్టారట..!

బన్నీ సినిమాలో ఒక్క పాట కోసం అంత ఖర్చు పెట్టారట..!

Published on Jan 2, 2020 8:23 AM IST

Samajavaragamana

అలవైకుంఠపురంలో సినిమాలోని సామజవరగమనా సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. చిత్ర యూనిట్ దీని సాంగ్ అఫ్ ది ఇయర్ గా ప్రచారం చేస్తున్నారు. థమన్ స్వర కల్పనలో సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట యూత్ నే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేసింది. ఐతే ఈ సాంగ్ ని పారిస్ నగరంలోని కొన్ని అందమైన ప్రదేశాలలో చిత్రీకరించడం జరిగింది. ఈ ఒక్క సాంగ్ షూటింగ్ కొరకు నిర్మాతలు దాదాపు ఐదు కోట్లకు పైగా ఖర్చు చేశారని తెలుస్తుంది. పారిస్ నగరంలో కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో అక్కడి అధికారుల పర్మిషన్స్ తీసుకొని అందమైన లొకేషన్స్ లో చిత్రీకరణ జరిపారట.

సాంగ్ భారీ హిట్ సాధించిన నేపథ్యంలో తెరపై కూడా గ్రాండ్ గా ఉండాలనే ఆలోచనతో అలవైకుంఠపురంలో టీం అత్యంత శ్రధ్దతో రిచ్ గా తెరకెక్కించారని సమాచారం. ఇటీవలే ఈ సాంగ్ ప్రోమో వీడియో విడుదల కాగా, యూత్ నుండి మంచి రెస్పాన్స్ దక్కింది. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు