నందుని మర్చిపోయిన సమంత

samantha-nandhu
ముచ్చటగా మూడోసారి నాగచైతన్య సరసన సమంత నటించిన సినిమా ‘ఆటో నగర్ సూర్య’. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. 12 నిముషాలు కత్తిరించిన తర్వాత బాగుందనే టాక్ వచ్చింది. ముఖ్యంగా దేవా కట్టా మాటలు, నాగ చైతన్య మాస్ పెర్ఫార్మన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కనిపించింది కాసేపే అయినా సమంత అభినయానికి మంచి మార్కులే పడ్డాయి.

‘ఆటో నగర్ సూర్య’ సూర్య ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో సమంత మాట్లాడుతూ.. సినిమా ఫలితం పట్ల సంతోషంగా ఉన్నానని తెలిపింది. దేవా కట్టా, చైతు సినిమా కోసం చాలా కష్టపడ్డారని చెప్పింది. అయితే సినిమాలో ప్రాముఖ్యత కలిగిన పాత్ర పోషించిన నందు గురించి చెప్పడం మర్చిపోయానని ఇంటర్వ్యూ తర్వాత ట్విట్టర్లో వ్యాఖ్యానించింది. కిచ్చా పాత్రలో నందు నటన సూపర్బ్ అని పేర్కొంది. సాయి కుమార్, అజయ్, నందులు తమ తమ పాత్రలలో ఓదిగిపోయారని ట్విట్టర్లో పోస్ట్ చేసింది.

Exit mobile version