అమీ జాక్సన్‌పై సమంత ప్రశంసల జల్లు!

అమీ జాక్సన్‌పై సమంత ప్రశంసల జల్లు!

Published on Jun 17, 2015 8:04 PM IST

Samantha-
సాధారణంగా హీరోయిన్లకు ఒకరంటే ఒకరికి పడదనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉంది. అయితే అది నిజం కాదని ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు నిరూపించి చూపగా, సమంత ఇదే విషయాన్ని బలంగా మరోసారి ఋజువు చేశారు. తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తూ నిర్మిస్తున్న సినిమాలో సమంత, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. వేల్‌రాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అమీ జాక్సన్, సమంతలు పాల్గొనగా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నటించడం విషయమై సమంత తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, అమీ జాక్సన్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. ఒక బ్రిటీష్ యువతి తమిళ డైలాగులను ఇంత చక్కగా పలకడం ఆశ్చర్యపరచిందని, అమీ జాక్సన్‌తో నటించడం బాగుందని సమంత ఈ సందర్భంగా తెలిపారు. మరో రెండు రోజుల్లో అమీ జాక్సన్ పార్ట్ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు