మెగా కోడలి కోసం చెఫ్ గా మారిన అక్కినేని వారి కోడలు.!

Published on Sep 27, 2020 12:00 pm IST

గత కొన్ని రోజుల నుంచీ మెగా కోడలు ఉపాసన కొణిదెల మరియు మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మరియు అక్కినేని కోడలు సమంతా అక్కినేనిలు బాగా ఎక్కువగా కలిసి కనిపిస్తున్నారు. అయితే వారు ఎందుకు ఆలా కనిపిస్తున్నారో రివీల్ అయ్యింది. అందరూ ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ని ఫాలో అయ్యేందుకు స్ఫూర్తిని అందించాలనే లక్ష్యంతో హీరో రామ్ చరణ్ సతీమణి,అపోలో సంస్థ వైస్ చైర్మన్ ఉపాసన కొణిదెల “యుఆర్ లైఫ్” అనే వెబ్ సైట్ ను నిర్వహిస్తున్నారు.

URLife.co.in వెబ్ సైట్ ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశం, ముఖ్యంగా – ప్రకృతి అనుకూలమైన జీవనం, సంపూర్ణ ఆరోగ్యం వంటి కొన్ని ప్రత్యేకమైన సిద్ధాంతాలను ప్రజలకు చేరువ చేయడమే అట.ఈ వెబ్ సైట్ కు అతిథి సంపాదకురాలిగా స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని పేరుని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సమంత , ఉపాసన తో కలిసి “తక్కలి సదం” వంటకాన్ని చేసి చూపించారు.

ఆ వంటకం రెసిపీ వీడియో లో చూపించారు.వాళ్లిద్దరూ ఎంజాయ్ చేస్తూ కుకింగ్ లో పాల్గొన్నారు.సమంత కూడా ఈ మధ్య “అర్బన్ ఫామింగ్” పేరు తో ఆరోగ్యం మీద ,తినే ఆహారం మీద చాలా శ్రద్ద తీసుకుంటూ అందరికీ స్ఫూర్తి గా నిలుస్తున్నారు. వీళ్ళిద్దరూ కలిసి అందరికి ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొనడం చూడ ముచ్చటగా ఉందని అంతా అంటున్నారు.

సంబంధిత సమాచారం :

More