
ఎంతమంది కలల రాణి, అందాల భామ సమంత పుట్టిన రోజు ఈ రోజు. ఉదయం నుంచి తనకి వస్తున్న విశేష్ చూసి సమంత ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బై పోతోంది. అలాగే ఉదయం నుంచి ట్విట్టర్ లో సందడి చేస్తోంది. తన 27వ పుట్టిన రోజు జరుపుకున్న సమంత ఈ రోజు హైదరాబాద్ లో లేదు.
సమంత ప్రస్తుతం తమిళ హీరో విజయ్ సరసన చేస్తున్న ‘కత్తి’ సినిమా షూటింగ్లో భాగంగా చెన్నైలో ఉంది. ఈ చిత్ర టీం ఒక పెద్ద కేక్ ని ఆర్డర్ చేసి సెట్ లో తన చేత కట్ చేయించారు. దాంతో సమంత షాక్ కి గురవ్వడమే కాకుండా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
కమర్షియల్ గా సక్సెస్ఫుల్ హీరోయిన్ అయిన సమంత ప్రస్తుతం ‘రభస’, వివి వినాయక్ సినిమాల్లో నటిస్తోంది. అది కాకుండా మనం త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. ఇది కాకుండా తమిళ్ లో సూర్య సరసన ‘అంజాన్’, విజయ్ సరసన ‘కత్తి’ సినిమాల్లో నటిస్తోంది.