పెళ్లి తరువాత కూడా స్టార్ హోదాలో ముందున్న సమంత.

పెళ్లి తరువాత కూడా స్టార్ హోదాలో ముందున్న సమంత.

Published on Jul 6, 2019 1:16 PM IST

హీరోయిన్ సమంత కి సినీపరిశ్రమలో గోల్డెన్ లెగ్ గా పేరుంది. చైతన్యతో ఆమె చేసిన “ఏమాయ చేసావే” తో మొదలైన విజయప్రస్థానం కొనసాగుతూనే ఉంది. సమంత తెలుగు,తమిళ భాషలలో నటించిన చాలా సినిమాలు విజయం సాధించినవే.దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించిన సమంత యూ టర్న్, ఓ బేబీ వంటి చిత్రాలతో స్టార్స్ తోనే కాకుండా సోలోగా కూడా హిట్స్ కొట్టగలనని నిరూపించుకుంటుంది.

సమంత సినీ కెరీర్ లో విశేషంగా ప్రస్తావించాల్సిన అంశం పెళ్లి తరువాత కూడా అభిమానుల్లో ఆమెకు కొంచెం కూడా క్రేజ్ తగ్గలేదు.2017 లో నాగ చైతన్యతో ఆమెకు పెళ్లి జరిగిన తరువాత విడుదలైన ‘రంగస్థలం’ చిత్రంతో ఆమె భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. భర్త చైతన్యతో ఆమె చేసిన “మజిలీ” కూడా సూపర్ హిట్ సొంతం చేసుకుంది. ఇప్పడు ఓ బేబీ మూవీతో సోలో హిట్ అందుకొని తన స్టార్ డమ్ ని మరోస్థాయికి పెంచుకుంది సమంత. పెళ్ళైన హీరోయిన్స్ కి అవకాశాలు తగ్గిపోతాయి, కానీ సమంత వరుస అవకాశాలు,విజయాలు అందిపుచ్చుకుంటూ తన ప్రత్యేకత చాటుకుంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు