భూకంప ఎఫెక్ట్ చూసి చలించిపోయిన టాప్ హీరోయిన్

భూకంప ఎఫెక్ట్ చూసి చలించిపోయిన టాప్ హీరోయిన్

Published on Apr 26, 2015 12:50 PM IST

Samantha
ప్రస్తుతం సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ గా వెలుగొందుతున్న తార సమంత. సమంత కేవలం ఒక హీరోయిన్ గానే కాకుండా మానవతామూర్తిగా ప్రత్యూష ఫౌండేషన్ ని స్థాపించి పలువురికి తమ వన్న్టు సాయం చేస్తోంది. ఇకపోతే నిన్న నేపాల్ లో వచ్చిన భూకంపం వలన చాలా ప్రదేశాలు ద్వంసం అయ్యాయి, అలాగే 150మందికి పైగా మరణించారు. ఈ సంఘటన కొన్ని మిలియన్స్ మందిని కదిలించి వేసింది, బాధపడేలా చేసింది. వీళ్ళలో హీరోయిన్ సమంత కూడా ఒకరు.

సమంత ప్రస్తుతం విక్రమ్ సరసన ’10 ఎంద్రాకుల్ల’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో తను ఓ నేపాలీ గర్ల్ పాత్రలో కనిపించనుంది. అందులో భాగంగా ఇటీవలే సమంత 20 రోజులు పాటు నేపాల్ లో షూటింగ్ చేసి వచ్చింది. దాంతో ఈ ప్రాంతానికి బాగా కనెక్ట్ అయిన ఈ భామ ఈ విషయం తెలుసుకొని చలించి పోయింది. ‘నేపాల్ లో జరిగిన భారీ భూకంపం వార్తలు విని ఎంతో షాక్ అయ్యాను. మేము అక్కడే షూట్ చేసాం. ఈ ఎఫెక్ట్ వలన నష్టపోయిన వారందరికీ ధర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానని’ తెలిపింది. సమంతపై ఖాట్మండు – భక్తాపూర్ ఏరియాల్లో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ మరియు సాంగ్స్ ని షూట్ చేసారు కానీ ఇప్పుడు ఆ రెండు ప్రాంతాలు బాగా దెబ్బతిన్నాయి.

తాజా వార్తలు