వాళ్ళతో అబద్దం చెప్పడమెందుకు… – సమంత

వాళ్ళతో అబద్దం చెప్పడమెందుకు… – సమంత

Published on Dec 5, 2014 10:17 AM IST

SAMANTHA
టాలీవుడ్ లో కథానాయికల ప్రాధాన్యం అందరికీ తెలిసిందే. దీని గురించి ఎవరికీ తెలీనట్టు కొంతమంది హీరోయిన్లు ‘ఈ సినిమాలో నా పాత్ర చాలా బాగుంటుంది. ఇంతకుమునుపెపుడూ ఇటువంటి పాత్ర చెయ్యలేదు. ఇకపైన చేస్తానో లేదో..’ అని ఓ… ఊదరగొడుతుంటారు. తీరా చూస్తే అదే.. పాత చింతకాయ పచ్చడి. ఇలా చెప్పడం వల్ల కొన్ని సందర్భాల్లో ఉన్నదీ పోయే.. ఉంచుకున్నదీ పోయే అన్న చందంగా మంచి పాత్ర లభించినా కూడా ప్రేక్షకుల మెప్పు పొందడం కష్టమవుతుంది. ఎందుకొచ్చిన తిప్పలని తర్వాత పశ్చాత్తాపపడినా ఫలితం శూన్యం.

ఈ విషయంపై రేసుగుర్రంలా దూసుకుపోతున్న సమంత స్పందిస్తూ ‘నేనలా చెప్పను. సినిమా రిలీజైన తర్వాత చూసి, జయాపజయాలు నిర్ణయించేది ప్రేక్షకులే. వాళ్ళకి అబద్దాలు చెప్పడమెందుకు’ అంటోంది ఈ బ్యూటీ. నటనలోనే కాదు మాటల్లోనూ ‘మేటి’ అనిపిస్తున్న ఈ చిన్నది ప్రస్తుతం తెలుగులో వేపచేట్టుకి తేనేపూసినట్టు సున్నితమైన కథలకు మంచి హ్యుమర్ ని జోడించడంలో దిట్ట అయిన త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ ‘జులాయి’ అల్లు అర్జున్ సరసన ఆడిపాడుతుంది. తమిళ్లో కూడా విజయ్ తో నటించిన ‘కత్తి’ విజయం సాధించింది. ఇప్పుడు కూడా మరికొన్ని కోలీవుడ్ సినిమాల్లో నటిస్తుందని సమాచారం.

తాజా వార్తలు