‘బ్రహ్మోత్సవం’పై ఎగ్జైటింగ్‌గా ఉన్న సమంత

‘బ్రహ్మోత్సవం’పై ఎగ్జైటింగ్‌గా ఉన్న సమంత

Published on Aug 26, 2015 12:15 AM IST

Samantha-
సూపర్ స్టార్ మహేష్ బాబు, అందాల తార సమంత.. ఈ ఇద్దరి కాంబినేషన్ ఇప్పటికే ‘దూకుడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె’ చెట్టు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రెండు సార్లు సూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ కాంబినేషన్ ‘బ్రహ్మోత్సవం’ సినిమాతో మరోసారి కనువిందు చేయనుంది. మహేష్‌తో కలిసి మూడో సినిమా చేయడం పట్ల సమంత ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. సెన్సిబుల్ సినిమాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, మహేష్‌తో కలిసి చేస్తోన్న బ్రహ్మోత్సవం సెట్స్‌పైకి వెళ్ళకముందునుంచే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.

ఈమధ్యే మహేష్ హీరోగా రూపొందిన ‘శ్రీమంతుడు’ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యాక, ఆయన చేస్తోన్న సినిమా ఇదే కావడంతో బ్రహ్మోత్సవంపై మంచి అంచనాలున్నాయి. శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమా కోసం తనదైన స్టైల్ కథను తయారుచేశారు. విజయవాడ నేపథ్యంలో నడిచే ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉండగా సమంత, కాజల్, ప్రణితలను ఆ పాత్రలకు ఎంపిక చేశారు. ఇందులో సమంత తన రోల్ విషయమై చాలా హ్యాపీగా ఉన్నారట. సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్ళనున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్‌లోనే సమంత బ్రహ్మోత్సవం యూనిట్‌తో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సమంత రోల్ కూడా చాలా కొత్తగా, కథకు కీలకంగా ఉంటుందని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు