పారితోషికంలో సమంత ‘యూటర్న్’ !

పారితోషికంలో సమంత ‘యూటర్న్’ !

Published on Sep 17, 2018 9:29 PM IST

తెలుగులో అగ్ర హీరోయిన్ గా దూసుకుపోతున్న నటి సమంత అక్కినేని తాజాగా నటించిన చిత్రం ‘యూటర్న్’. ఇటీవల విడుదలైన ఈచిత్రం మంచి కలెక్షన్స్ ను సాధిస్తూ బ్లాక్ బ్లాస్టర్ విజయం వైపు దూసుకుపోతుంది.

ఇక ఈచిత్రంతో సమంత కు భారీ రెమ్యూనరేషన్ ముట్టిందట. మాములుగా సమంత ఒక్క సినిమాకు కోటి రూపాయలు తీసుకుంటుంది. కానీ ఈసినిమాకు పారితోషికం తీసుకోకుండా ప్రీ రిలీజ్ బిజినెస్ లో వాటా తీసుకుందట. ఇక ఈ చిత్రం 16కోట్ల బిజినెస్ చేసింది. ఆ లెక్కన సమంత 3కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుందని తెలుస్తుంది.

సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈచిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆమె తప్ప స్టార్ క్యాస్ట్ ఎవరు లేకున్నా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకరావడంలో సమంత విజయం సాధించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు