అందరినీ విమర్శించే ఆమె సమంతను మాత్రం పొగిడేసింది.

అందరినీ విమర్శించే ఆమె సమంతను మాత్రం పొగిడేసింది.

Published on Jul 6, 2019 2:58 AM IST

బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ సిస్టర్స్ కంగనా రనౌత్,రంగోలి చండేలా ఏ విషయం గురించైనా కుండబద్దలు కొట్టేలా మాట్లాడుతారు. ఇప్పటికే ఈ ఇద్దరు సిస్టర్స్ బాలీవుడ్ లోని ప్రముఖ హీరోలతోపాటు, దర్శకులు నిర్మాతలపై కూడా తీవ్ర ఆరోపణలు చేయడం,వారితో గొడపడటం జరిగింది. తాజాగా కంగనా నటించిన “జడ్జిమెంటల్ హై క్యా” మూవీ ట్రైలర్ విషయంలో కూడా కంగనా చెల్లులు రంగోలి, తాప్సి పైనకూడా తనదైన శైలిలో విరుచుకుపడింది. ఐతే సమంత నటించిన ‘ఓ బేబీ’ మూవీ పై ,సమంత పై మాత్రం ఈమె ప్రశంసలు కురిపించింది.

”ఓ బేబీ’ అద్భుతమైన విజయం అందుకుంది. సమంత అసలుసిసలైన ఫెమినిస్ట్‌. ఆమె జీవితం ఓ సక్సెస్‌ స్టోరీ. ఓ గొప్ప కుటుంబానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ తనకంటూ ఓ సొంత గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలాంటి దేవతల్ని మేం మెచ్చుకుంటాం. కంగన బృందం నుంచి మీకు ఆల్‌ ది బెస్ట్‌’ అని రంగోలీ ట్వీట్‌ చేశారు. ‘ఎంతో దయతో మాట్లాడిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు’ అని సామ్‌ రిప్లై ఇచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు