సినిమా నిర్మాణంలోకి సమంత!

సినిమా నిర్మాణంలోకి సమంత!

Published on Dec 10, 2023 11:05 PM IST

స్టార్ హీరోయిన్ సమంత త్వరలో సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టబోతున్నారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరిట కొత్త ప్రొడక్షన్ హౌస్ ను మొదలుపెట్టినట్లు సమంత సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ‘బ్రౌన్ గర్ల్ ఈజ్ ఇన్ ది రింగ్ నౌ’ అనే పాట స్ఫూర్తితో ట్రాలాలా అని తన నిర్మాణ సంస్థకు పేరు పెట్టానని సమంత స్పష్టం చేసింది. వాస్తవికతతో కూడిన అర్థవంతమైన కథలు చెప్పగలిగే ప్రతిభావంతులైన కొత్త దర్శకులను తన నిర్మాణ సంస్థ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాను అని సమంత తన పోస్ట్ లో తెలిపింది.

ఇక సమంత చివరిసారిగా విజయ్ దేవరకొండ సరసన పాన్ ఇండియన్ ఫిల్మ్ ఖుషిలో నటించింది. ప్రస్తుతం సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అన్నట్టు తన ప్రొడక్షన్ హౌస్ నుంచి థియేటర్ల కోసమే కాకుండా OTT ప్లాట్‌ఫారమ్‌ల కోసం కూడా ప్రత్యేకమైన కంటెంట్‌ను కూడా సమంత ప్లాన్ చేస్తోందట. ప్రస్తుతానికి నటిగా ఓ అమెరికన్ రీమేక్ సిరీస్ లో సమంత నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు