సమంత చేసిన కొత్త ప్రాజెక్ట్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ -2’. జూన్ 4వ తేదీన అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కానుంది. అయితే ఇటీవల విడుదలైన ట్రైలర్ తమిళనాట ప్రకంపనలు సృష్టించింది. ఇందులో సమంత తమిళనాడుకు చెందిన ఒక రెబల్ పాత్రలో నటించడం జరిగింది. కథ మొత్తం చెన్నైలోనే జరుగుతుంది. ఇందులో ఐసిస్ ప్రస్తావన కూడ ఉంది. ట్రైలర్లోని కొన్ని షాట్స్ తమిళులను కించపరిచేలా ఉన్నాయని, వెబ్ సిరీస్లో కూడ అలాంటి కంటెంటే ఉండబోతుందని తమిళ ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు వెబ్ సిరీస్ బ్యాన్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడ రాశారు. అసలు తమిళనాడుకు చెందిన సమంత తమిళులను కించపరిచే ఇలాంటి వెబ్ సిరీస్ చేయడం ఏమిటని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సమంతను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. మొదట్లో సమంత కూడ ఈ విమర్శలకు స్పందించాలనే అనుకున్నారు. కానీ ఆమె స్పందిస్తే వివాదం సర్దుమణగడం కాదు కదా మరుక్షణమే మరింత పెద్దదిగా మారిపోవడం ఖాయం. దీన్ని గ్రహించే సమంత మౌనం పాటించడం మొదలుపెట్టారు. దీంతో విమర్శలన్నీ వన్ సైడ్ అయ్యాయి. వెబ్ సిరీస్లో నిజంగా తమిళులను నొప్పించే కంటెంట్ ఉందా లేదా అనేది పక్కనపెడితే సున్నిత సమయంలో సమంత పాటించిన సమన్వయం నిజంగా అభినందనీయం.
