సమంత రేర్ ఫీట్.. ఎవరూ టచ్ చేయలేని రికార్డు..!

సమంత రేర్ ఫీట్.. ఎవరూ టచ్ చేయలేని రికార్డు..!

Published on Jun 21, 2026 6:59 AM IST

సౌత్ ఇండియా స్టార్ బ్యూటీ సమంత తన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’తో బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తుంది. నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్‌తో ఆమె ఫుల్ హ్యాపీగా ఉంది. ఇక ఈ సినిమాకు తొలిరోజే బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ రాబట్టి అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. ఈ సినిమాకు ఇటు టాలీవుడ్‌తో పాటు ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర కూడా అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది.

అయితే, ఓవర్సీస్‌లో సమంత ఇప్పటికే ఒక రేర్ ఫీట్ సాధించింది. యూఎస్ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక 1 మిలియన్ డాలర్ చిత్రాల హీరోయిన్‌గా సామ్ పేరిట రికార్డు ఉంది. ఆమె ఏకంగా 16 సినిమాలతో ఈ రికార్డును కంటిన్యూ చేస్తుంది. అయితే, ఇప్పుడు మా ఇంటి బంగారం కూడా ఈ సండే ముగిసే సమయానికి 1 మిలియన్ డాలర్ మార్క్ అలవోకగా అందుకుంటుంది.

దీంతో యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 17 చిత్రాలతో సామ్ తన పేరిట సరికొత్త రికార్డులు క్రియేట్ చేసుకుంటుంది. ఈ రికార్డును ఇప్పట్లో ఎవరూ టచ్ చేయలేని పరిస్థితి అని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

తాజా వార్తలు