సమంత హీరోయిన్ ఎలా అయ్యిందంటే…?

samantha
’ఏమాయ చేశావె’ సినిమా ద్వారా తెలుగుప్రేక్షకులకు పరిచయం అయిన సమంత నిజానికి అనుకోకుండానే హీరోయిన్ అయ్యిందట. గౌతమ్ మీనన్ సినిమాలో ఎంపిక కావడానికి ముందు కొన్ని వాణిజ్య ప్రకటనల్లో నటించింది కూడా. సాధారణ మోడల్ నుంచి స్టార్ హీరోయిన్ గా మారడం వెనుక ఓ ఆసక్తికరమైన కథ కూడా ఉంది.

‘‘నా స్నేహితురాలి పుట్టినరోజు నా జీవితాన్ని మార్చేసింది. ఆ పుట్టినరోజు పార్టీ లో దిగిన ఫోటొలు తర్వాత రోజు ఓ దిన పత్రికలో వచ్చాయి. అందులో నా ఫోటోలు చూసి చెన్నైలోని ఓ బిజినెస్‌మేన్ తమ బట్టల దుకాణానికి మోడలింగ్ చేయమన్నారు. కేవలం పాకెట్‌ మనీ కోసం మోడల్‌ అయ్యాను. తర్వాత సినిమాటోగ్రాఫర్‌ రవివర్మన్‌ ద్వారా నాకు హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. కానీ అప్పటికే గౌతమ్ మీనన్ నా ఫొటోలు చూసి ఉండటంతో ‘ఏ మాయ చేసావె’లో అవకాశం ఇచ్చారు. ఇక ఆ సినిమాలో జెస్సీ పాత్ర నా జీవితాన్ని మార్చేసింది’ అని సమంత చెప్పుకొచ్చింది. సమంత నితిన్ సరసన నటించిన ’అ…ఆ’ సినిమా ఈ వారం విడుదల అవుతున్నది.

Exit mobile version