
క్రేజీ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ – క్రేజున్న హీరోయిన్ సమంత కాంబినేషన్ లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’, ‘S/O సత్యమూర్తి’ సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద పెద్ద హిట్ అయ్యాయి. గత కొద్ది రోజులుగా త్రివిక్రమ్ – సమంత కలిసి ఓ లో బడ్జెట్ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయనున్నారని మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందరూ నిజంగానే ఈ సినిమా ఉంటుందని ఆశిస్తున్నారు కానీ సమంత త్రివిక్రమ్ సినిమాపై పూర్తి క్లారిటీ ఇచ్చి ఆ వార్తలకి తెరదింపింది.
ఈ సినిమా గురించి సమంతని అప్రోచ్ అయితే ‘ నేను త్రివిక్రమ్ డైరెక్షన్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నాను అని వస్తున్న వార్తల్లో నిజం లేదు. నాకు త్రివిక్రమ్ తో చేయడం అంటే ఇష్టం కానీ ప్రస్తుతం ఆయనతో ఎలాంటి సినిమా సైన్ చేయలేదని’ తెలిపింది. ప్రస్తుతం ఎక్కువ తమిళ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న సమంత రీసెంట్ గా మహేష్ బాబు నటించనున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమాకి సైన్ చేసింది. ఈ సినిమా జూలై నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.

