అందుకే స్టార్ హీరోయిన్స్ అలా చేయలేరు – సమంత

Published on Mar 10, 2020 12:12 am IST

టాలీవుడ్ టాప్ యాక్ట్రెస్ సమంత కెరీర్ లో లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఆమె నటించిన వాటిలో చాల సినిమాలు విజయం సాధించినవే. ఇక పదేళ్లుగా ఆమె టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. చైతూ తో పెళ్లి తరువాత కూడా ఆమె తెలుగు మరియు తమిళ భాషలో మంచి అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. కాగా ఓ ఇంటర్వూలో సమంతను స్టార్ హీరోల వలే హీరోయిన్స్ ఎందుకు భిన్నమైన రోల్స్ చేయరు అని అడుగగా ఆమె ఆసక్తికర సమాధానం చెప్పారు.

స్టార్ హీరోలకు ఉండే ఫాలోయింగ్ మరియు అట్రాక్షన్ లో హీరోయిన్స్ కి ఒక శాతం కూడా ఉండదు. అలాగే హీరోయిన్స్ కి సోలో గా హిట్ రావడం అనేది చాల కష్టం. హీరోయిన్స్ ఎంతో కష్టపడినా రాని స్పందన ఓ స్టార్ హీరో అలా స్క్రీన్ పై నడుచుకుంటూ వెళుతుంటే చాలు వచ్చేస్తుంది. హీరోయిన్స్ కి డిఫరెంట్ రోల్స్ చేసే అవకాశం రావడం కష్టం.. అలాగే వచ్చినా చేయడం రిస్క్ తో కూడుకున్న పని. హీరోయిన్స్ కి ప్లాప్స్ వస్తే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే హీరోయిన్స్ భిన్నమైన రోల్స్ ట్రై చేయరు అని చెప్పారు.

సంబంధిత సమాచారం :

More