స్నేహం కోసం సమంత స్పెషల్ సాంగ్..?

samantha
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నీరజ కోన, సమంత చాలా క్లోజ్ ఫ్రెండ్స్. తన స్నేహితురాలి కోసం స్పెషల్ సాంగ్ లో కనిపించడానికి సమంత రెడీ అయ్యిందట. అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గీతాంజలి’. స్టార్ రైటర్ కోన వెంకట్ తన మిత్రుడు యంవివి సత్యనారాయణతో కలసి ‘గీతాంజలి’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సమంత ఒక స్పెషల్ సాంగ్ లో కనిపిస్తుందనే వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. అధికారికంగా ఎటువంటి ప్రకటన లేదు.

శ్రీనివాస్ రెడ్డి, రావు రమేష్, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘గీతాంజలి’ సినిమాకు రాజ్ కిరణ్ దర్శకుడు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఇప్పటికే బ్రహ్మానందంపై ఒక స్పెషల్ సాంగ్ చిత్రీకరించారు. ప్రస్తుతం సమంత క్షణం తీరిక లేకుండా సినిమా షూటింగ్లలో పాల్గొంటుంది. ఈ ఏడాది సమంత నటించిన ఏడు సినిమాలు విడుదలవుతున్నాయి. ఇంత బిజీలో కూడా కేవలం తన స్నేహితురాలి కోసం స్పెషల్ సాంగ్ లో నటించాలి అనే నిర్ణయం తీసుకుందట. ఇందులో నిజం ఎంతో తెలియాలంటే ఎవరో ఒకరు పెదవి విప్పాల్సిందే..!

Exit mobile version