బరువు భాద్యతలన్నీ సమంతవే !

బరువు భాద్యతలన్నీ సమంతవే !

Published on Mar 19, 2021 3:00 AM IST

Samantha2

డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తున్న పిరియాడికల్ మూవీ ‘శాకుంతలం’. మహాభారతంలోని ఆదిపర్వం నుండి తీసుకున్న శాకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో శాకుంతల పాత్రను స్టార్ నటి సమంత చేయనుంది. ఎందరో హీరోయిన్ల పేర్లను పరిశీలించిన గుణశేఖర్ చివరగా సమంతను ఫైనల్ చేసుకున్నారు. కథ పూర్తిగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా. సమంతకు జోడీగా నటిస్తున్నది టాలీవుడ్ హీరో కాదు. దేవ్ మోహన్ తెలుగు ప్రేక్షకులకు అస్సలు పరిచయం లేని నటుడు.

సినిమా బిజినెస్ సైతం హీరోయిన్ క్రేజ్ మీదనే ఆధారపడి జరగాల్సి ఉంటుంది. అందుకే సమంతను తీసుకున్నారు. సమంత భారీ పారితోషకం డిమాండ్ చేసినా గుణశేఖర్ వెనక్కుతగ్గకుండా ఆమెను తీసుకొచ్చారు. బడ్జెట్ కూడ చిన్నదేమీ కాదు. ప్రతి అంశంలోనూ భారీగా ఖర్చు చేస్తున్నారు. పలు భాషల్లో చిత్రం రిలీజ్ కానుంది. అన్ని చోట్లా సమంతనే సినిమాకు సెల్లింగ్ ఎలిమెంట్. మరి సమంత ఈ ప్యాన్ ఇండియా ప్రాజెక్టును ఒంటరిగా ఎలా మోస్తారో, లాభాల తీరానికి ఏరకంగా లాక్కొస్తారో చూడాలి. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు