
తెలుగు తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న ముద్దు గుమ్మ సమంత. ఇప్పటి వరకూ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో, పూర్తి గ్లామరస్ పాత్రల్లో ప్రేక్షకులను మెచ్చిన సమంత ఇప్పటి వరకూ రిస్కీ స్టంట్స్ చేసే టాం బాయ్ పాత్రలో కనిపించలేదు. కానీ ఈ సంవత్సరం అందరినీ థ్రిల్ చేసే రీతిలో స్టంట్స్, రిస్కీ సీన్స్ చేసి మనల్ని సర్ప్రైజ్ చెయ్యడానికి సిద్దమైంది. ఇంతకీ ఏ సినిమాలో అనుకుంటున్నారా… తమిళ స్టార్ హీరో విక్రమ్ నటిస్తున్న ’10 ఎన్రాదుకుల్ల’.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. మొదటి సారిగా తమిళంలో రోడ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఇందులో సమంత తన కెరీర్లో ఎప్పుడూ చెయ్యను అనుకున్న రిస్కీ స్టంట్స్ చేసిందట. ఆ స్టంట్స్ ని సమంత ఇలా కూడా చేయగలదనే ఫీలింగ్ ఆడియన్స్ లో వస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో ఛార్మీ ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించడమే కాకుండా సినిమాని టర్న్ చేసే పాత్రలో కనిపించనుంది. విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఎఆర్ మురుగదాస్ నిర్మిస్తున్నాడు. మే లో ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.