సమంత మిలియన్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది

సమంత మిలియన్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది

Published on Jul 7, 2019 11:00 AM IST

స్టార్ హీరోయిన్ సమంత నటించిన తాజా చిత్రం ‘ఓ బేబీ’ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. శుక్రవారం మొదటిలో షో నుండే చిత్రానికి హిట్ టాక్ వచ్చింది. ఇక ఓవర్సీస్లో అయితే ప్రీమియర్లతోనే చిత్రం హిట్ అని తేలిపోయింది. గురువారం రాత్రి ప్రదర్శించబడిన ప్రీమియర్ల ద్వారా 145,637 డాలర్లను రాబట్టుకున్న ఈ చిత్రం శుక్రవారం 152,716 డాలర్లను వసూలు చేసింది.

శనివారం కూడా అదే జోరు కొనసాగించి 150,006 డాలర్ల పైగానే రాబట్టింది. ఇక ఈరోజు ఆదివారం కావడంతో వసూళ్ళు ఇంకా మెరుగ్గా ఉండే అవకాశాం ఉంది. అంటే ఈరోజుతో హాఫ్ మిలియన్ వసూళ్ళనూయి దాటనున్న ఈ చిత్రానికి మిలియన్ మార్కును అందుకోవడం,పెద్ద కష్టమేమీ కాదనిపిస్తోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు