క్లైమాక్స్‌కు చేరుకున్న ‘సంబరాల ఏటి గట్టు’..!

Sambarala-Yetigattu

మెగా హీరో సాయి దుర్గా తేజ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘సంబరాల ఏటి గట్టు’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ఫైనల్ షెడ్యూల్ తాజాగా హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. మెయిన్ లీడ్‌పై అత్యంత కీలకమైన, ఎమోషనల్ అండ్ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించేందుకు వీలుగా ప్రొడక్షన్ టీం హైదరాబాద్‌లో ఒక భారీ ప్రత్యేక సెట్‌ను నిర్మించింది. ప్రస్తుతం ఈ సెట్‌లోనే టాప్ టెక్నీషియన్ల సమక్షంలో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఈ కెరీర్ డిఫైనింగ్ రోల్ కోసం సాయి దుర్గా తేజ్ సరికొత్తగా మేకోవర్ అయ్యాడు. మునుపెన్నడూ చూడని విధంగా రా ఎనర్జీ, ఊరమాస్ అప్పీల్‌తో కూడిన లుక్‌లో ఆయన అలరించబోతున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో మరింత హైప్ పెంచేలా ఒక టాప్ బాలీవుడ్ నటుడు కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. ‘హను-మాన్’ వంటి గ్లోబల్ హిట్‌ను అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే పలు లొకేషన్లలో మేజర్ షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఫైనల్ షెడ్యూల్ అవ్వగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించనుంది. ఈ ఏడాది డిసెంబర్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version