ఏం తేడా లేదు..అంతకు మించే మ్యాజిక్ చేసిన తారక్..!

Published on Mar 13, 2021 12:03 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సిల్వర్ స్క్రీన్ పై తన స్క్రీన్ ప్రెజెన్స్ ఏ రేంజ్ లో చూపించాడో మనం చూసాం. అలాగే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తో మన తెలుగులో మొట్ట మొదటిసారిగా కొత్త షో ను పరిచయం చేసిన తారక్ స్మాల్ స్క్రీన్ పై కూడా తన బెంచ్ మార్క్ ను తన స్టార్డం కు ఏమాత్రం అడ్డు కాకుండా సెట్ చేసుకున్నాడు. మరి మళ్ళీ ఇన్నాళ్లకు మళ్ళీ స్మాల్ స్క్రీన్ పైకి రావడానికి రెడీ అయ్యాడు. అదే జెమినీ టీవిలో “ఎవరు మీలో కోటీశ్వరులు” షో తో పలకరించడానికి రెడీ అయ్యారు.

మరి ఇప్పుడు ఆ షో కు సంబంధించి అధికారిక ప్రకటనతో పాటుగా ప్రోమోను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఇది చూస్తే మాత్రం అప్పుడు బిగ్ బాస్ షో ప్రోమోకు ఎంత మ్యాజిక్ చేసారో దీనిలో మాత్రం అంతకు మించిన మ్యాజిక్ ను చేసి చూపించారని చెప్పాలి. డ్రెస్సింగ్ నయా లుక్ లో ఫీస్ట్ ఇవ్వడంతో పాటుగా తన మార్క్ డైలాగ్స్ బాడీ లాంగ్వేజ్ తో అదరగొట్టారు. ఈ ప్రోమోలో మాత్రం సూపర్బ్ గా కనిపించారు మరి ఫైనల్ గా ఫస్ట్ ఎపిసోడ్ ఎలా హోస్ట్ చేస్తారో చూడాలి.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :