పాటలతో సందడి చేయనున్న ‘సమ్మోహనం’ !

‘జెంటిల్మెన్, అమీ తుమీ’ వంటి వరుస హిట్లిచ్చిన దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి ప్రస్తుతం ‘సమ్మోహనం’ అనే సినిమానుచేస్తున్నారు. ఇందులో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ భిన్నంగా, కొత్తగా ఉండటంతో ప్రేక్షకుల్లో సినిమా పట్ల ఆసక్తి నెలకొంది. దీంతో చిత్ర యూనిట్ పాటలతో సందడి చేసేందుకు సిద్ధమైంది.

ఆడియోలోని మొదటి పాట ‘ఊహలు ఊరేగే గాలంతా’ 1మే 2న సాయంత్రం 5 గంటల 18 నిముషాలకు విడుదలకానుంది. పూర్తిస్థాయి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండబోతున్న ఈ సినిమాలో సుధీర్ బాబుకు జోడీగా బాలీవుడ్ నటి అదితిరావ్ హైదరి కనిపించనుంది. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందించగా, పిజి. విందా సినిమాటోగ్రఫీ చేశారు. జూన్ 15వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

Exit mobile version