సోషల్ నెట్వర్క్ ద్వారా వెలుగులోకి వచ్చిన బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు తన మొదటి సినిమా ‘హృదయ కాలేయం’తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇలాంటి ఓ హీరో సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చి విజయం సాధించడం చెప్పుకోదగిన విషయం.
మాకు అందిన తాజా వార్తల ప్రకారం అల్లరి నరేష్ హీరోగా నటించనున్న సినిమాలో సంపూర్నేష్ బాబు ఓ కీలక పాత్రలో నటించనున్నాడని సమాచారం. ఈ కామెడీ ఎంటర్టైనర్ కి సంపూర్నేష్ బాబు క్రేజ్ కూడా హెల్ప్ అవుతుందని ఈ చిత్ర టీం అనుకుంటోంది.
మోనాల్ గజ్జర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ కార్తీక అల్లరి నరేష్ కి సిస్టర్ గా కనిపించనుంది. చిన్నికృష్ణ ఈ సినిమాకి డైరెక్టర్.


