వచ్చే వారం నుండి విక్రమ్, సమంత టీంతో సంపూర్నేష్ సందడి.

sampoornesh-vikram
విక్రమ్, సమంత జంటగా విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ఎఆర్ మురుగదాస్ నిర్మిస్తున్న తమిళ సినిమా ’10 ఎండ్రదుకుల్లా’. ఈ సినిమా తెలుగు వెర్షన్ లో బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు కమెడియన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే వారం ఫిబ్రవరి 27 నుండి ఈ సినిమా షూటింగులో సంపూర్నేష్ బాబు పాల్గొంటారని సమాచారం. చెన్నై నగర శివార్లలో ఈవిపి ఏమ్యూజమేంట్ పార్క్ లో ప్రత్యేకంగా వేసిన సెట్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఆంధ్రా బోర్డర్, దాభా, పెట్రోల్ బంక్, మార్కెట్ లను సినిమా కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.

సంపూర్నేష్ బాబు ప్రధాన పాత్రలో నటించిన ‘బందిపోటు’ సినిమా ఈ శుక్రవారం విడుదలవుతుంది. ఇవి కాకుండా ‘సింగం 123’, ‘కొబ్బరిమట్ట’ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఈ ఏడాది సంపూర్నేష్ బాబు నటించిన నాలుగు సినిమాలు విడుదలయ్యె అవకాశం ఉంది.

Exit mobile version