నాగ్, నాని సినిమాలో సంపుర్నేష్ !

నాగ్, నాని సినిమాలో సంపుర్నేష్ !

Published on Mar 29, 2018 9:36 PM IST

నాగార్జున , నాని సినిమా మొదటి షెడ్యూల్ ఇటీవలే పూర్తి అయింది. నాని ఈ షూట్ లో పాల్గొనడం జరిగింది. నాగార్జున సెకండ్ షెడ్యూల్ నుండి జాయిన్ కాబోతున్నాడు. తాజా సమాచారం మేరకు సంపుర్నేష్ బాబు ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఆ పాత్రకు సంపు అయితే బాగుంటుందని భావించిన దర్శకుడు అతన్ని తీసుకోవడం జరిగింది.

ఫ్యామిలి ఎంటర్టైనర్ గా తెరకేక్కబోతున్న ఈ సినిమాలో నాగార్జున డాన్ గా నాని డాక్టర్ గా కనిపించబోతున్నారని సమాచారం. భలే మంచి రోజు , శమంతకమని సినిమల తరువాత శ్రీరాంఆదిత్య ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను వైజయంతి బ్యానర్ లో అస్వినీదత్ నిర్మిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు