నటుడు శివాజీ, లయ, మాస్టర్ రోహన్ ముఖ్య పాత్రల్లో నటించిన రీసెంట్ కామెడీ క్రైమ్ డ్రామా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ రిలీజ్కు ముందు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమాకు థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. ఇక ఇటీవల ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్లో ఈ చిత్రం స్ట్రీమింగ్కు వచ్చింది.
ఇక ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు ఈ చిత్రం రెడీ అయ్యింది. ప్రముఖ ఛానెల్ ఈటీవీలో ఈ సినిమా జూన్ 21న సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా టెలికాస్ట్ కానుంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేశారు.
థియేటర్లలో మిస్ అయిన వారు లేదా ఒక మంచి వినూత్నమైన కథను వీక్షించాలనుకునే వారు ఈ చిత్రాన్ని ఈటీవీలో వీక్షించవచ్చు. మరి ఈ చిత్రానికి బుల్లితెర ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్ అందిస్తారో చూడాలి.
