మా మూవీలో కెప్టెన్ రఫీక్ గా సందీప్ కిషన్ అద్బుతంగా నటించారు – ‘కెప్టెన్ మిల్లర్’ డైరెక్టర్ అరుణ్ మతేశ్వరన్

మా మూవీలో కెప్టెన్ రఫీక్ గా సందీప్ కిషన్ అద్బుతంగా నటించారు – ‘కెప్టెన్ మిల్లర్’ డైరెక్టర్ అరుణ్ మతేశ్వరన్

Published on Jan 23, 2024 2:04 AM IST

వెర్సటైల్ యాక్టర్ ధనుష్ హీరోగా యువ దర్శకుడు అరుణ్ మతేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కెప్టెన్ మిల్లర్. ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ ఇప్పటికే తమిళ్ లో రిలీజ్ అయి మంచి సక్సెస్ తో కొనసాగుతోంది. జనవరి 26న ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేయనున్నారు. కన్నడ యాక్టర్ శివ రాజ్ కుమార్, తెలుగు యువ నటుడు సందీప్ కిషన్ కీలక పాత్రలు చేసిన ఈ మూవీని సత్యజ్యోతి ఫిలిమ్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మించింది.

విషయం ఏమిటంటే, తాజా ఇంటర్వ్యూలో భాగంగా డైరెక్టర్ అరుణ్ మాట్లాడుతూ, తనకు సందీప్ కిషన్ తో 12 ఏళ్ళ నుండి స్నేహం ఉందని, అలానే 2012 సమయంలో తనతో ఒక మూవీ చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వలన అది కుదరలేదని అన్నారు. ఇక ఈ మూవీలో కెప్టెన్ రఫీక్ పాత్రలో సందీప్ నటన ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంటుందని తెలిపారు. ప్రియాంక మోహన్ మంచి మాస్ రస్టిక్ పాత్ర చేసిన ఈ మూవీలో కెప్టెన్ మిల్లర్ గా ధనుష్ అలరించే పెర్ఫార్మన్స్ కనబరిచి తమిళ ఆడియన్స్ నుండి మంచి పేరు అందుకుంటున్నారు. జివి ప్రకాష్ సంగీతం అందించిన ఈ మూవీ తెలుగు ఆడియన్స్ ని ఎంత మేర అలరిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు