యువ హీరో సందీప్ కిషన్ మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఆయన తన లేటెస్ట్ మూవీలో హాకీ ప్లేయర్ లా కనిపించనున్నారు. ‘ఏ వన్ ఎక్సప్రెస్’ టైటిల్ తో రానున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. హాకీ స్టిక్ భుజాన పెట్టుకొని, క్రీడా దుస్తులలో మైదానం వైపు ఆసక్తిగా చూస్తున్న సందీప్ లుక్ అద్భుతంగా ఉంది.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఏ ఏ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి డెన్నిస్ జీవన్ దర్శకత్వం వహిస్తుండగా హిప్ హాఫ్ టామీజా సంగీతం అందిస్తున్నారు. వచ్చేనెలలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ఇక సందీప్ నటించిన తెనాలి రామ కృష్ణ బీఏ బీఎల్ విడుదలకు సిద్ధంగా ఉంది.


