
సందీప్ కిషన్ హీరోగా ‘గుండెల్లో గోదారి’ ఫేం కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘జోరు’. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇటివల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చింది. భీమ్స్ స్వరపరిచిన ఆడియో గత నెలలో విడుదలై శ్రోతలను అలరిస్తుంది. నవంబర్ 7న విడుదల చేయడానికి సన్నాహాలు నిర్మాతలు చేస్తున్నారు.
‘జోరు’లో సందీప్ సరసన ముగ్గురు హీరోయిన్లు రాశి ఖన్నా, ప్రియ బెనర్జీ, సుష్మలు నటించారు. బ్రహ్మానందం, సప్తగిరి, అజయ్, బాలయ్య, కాశి విశ్వనాద్, షాయాజీ షిండే, సత్యం రాజేష్ తదితులు ముఖ్య పాత్రల్లో సందడి చేయనున్నారు. అర్జున్ సమర్పణలో శ్రీ కీర్తి ఫిల్మ్స్ పతాకంపై అశోక్, నాగార్జున ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.