ఈ ఇయర్ ఎండ్ కి స్పిరిట్ స్టార్ట్ – సందీప్ రెడ్డి వంగా!

ఈ ఇయర్ ఎండ్ కి స్పిరిట్ స్టార్ట్ – సందీప్ రెడ్డి వంగా!

Published on Mar 1, 2024 12:25 AM IST

యానిమల్ మూవీ తో భారీ హిట్ కొట్టారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ డైరెక్టర్ చేస్తున్న నెక్స్ట్ మూవీ స్పిరిట్. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అంటూ ఆడియెన్స్, ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేడు గామి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో స్పిరిట్ మూవీ గురించి మాట్లాడారు. ఈ ఇయర్ ఎండ్ కి స్టార్ట్ అవుతది అంటూ చెప్పుకొచ్చారు.

ప్రభాస్ ప్రస్తుతానికి భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్నారు. కల్కి 2898AD చిత్రం తో బిజీగా ఉన్నారు. నెక్స్ట్ ది రాజా సాబ్ స్టార్ట్ కానుంది. ఈ చిత్రం ముగిసే సమయానికి స్పిరిట్ షురూ కానుంది. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు