ప్రస్తుతం మొత్తం ఇండియన్ సినిమాని షేక్ చేస్తున్న సెన్సేషనల్ హిట్ చిత్రమే “ధురంధర్” (Dhurandhar). మంచి అంచనాలు నడుమ వచ్చి ఈ సినిమా ఊహించని రన్ తో ఒక ఫినామినాగా మారుతుంది. ఆల్రడీ 500 కోట్లకి పైగా వసూళ్లు క్రాస్ చేసిన ఈ సినిమా ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అదే సాలిడ్ రన్ ని కంటిన్యూ చేస్తుంది.
అయితే ఈ సినిమా వచ్చిన తర్వాత మన తెలుగు ఫిల్మ్ మేకర్ సందీప్ రెడ్డి వంగ కోసం కూడా చర్చ మొదలైంది. అనిమల్ లాంటి వైలెంట్ సినిమా చూసిన తర్వాత దాని రేంజ్ లోనే సాలిడ్ వైలెన్స్ ఇంకా ఎమోషన్స్ దర్శకుడు ఆదిత్య ధర్ ధురంధర్ తో చూపించడంతో సరైన పోటీ దొరికింది అని చాలానే కామెంట్స్ వచ్చాయి. అయితే ఫైనల్ గా ధురంధర్ పై సందీప్ రెడ్డి వంగ తన సాలిడ్ వ్యూ పంచుకున్నారు.
Sandeep Reddy Vanga Reviews Dhurandhar – ‘ధురంధర్’కి సందీప్ రెడ్డి వంగ ఫిదా..
ధురంధర్ సినిమా అదిరింది అని నటులు అక్షయే ఖన్నా, రణ్వీర్ లు తన పాత్రల్లో లీనమైపోయారని, సినిమా మ్యూజిక్, స్క్రీన్ ప్లే దర్శకత్వం అన్నీ టాప్ లో ఉన్నాయని మనకి తెలియని త్యాగాలని అద్భుతంగా చూపించినందుకు దర్శకుడు ఆదిత్య ధర్ కి ధన్యవాదాలు అని సందీప్ (Sandeep Vanga) తెలపడం జరిగింది.
సందీప్ కి ధురంధర్ దర్శకుడు అంతే స్వీట్ రిప్లై
ధన్యవాదాలు, డియర్ సందీప్. మీ నుండి ఈ ప్రశంసలు రావడం నాకు ఎంతో ప్రత్యేకం. నీ సినిమా పట్ల నీకున్న అంకితభావాన్ని, ఎక్కడా రాజీ పడని మీ శైలిని నేను ఎప్పుడూ గౌరవిస్తాను. ‘ధురంధర్’ సినిమాని అత్యంత ఎంతో నమ్మకంతో, నిజాయితీగా రూపొందించాం. మీ మాటలు ఆ ప్రయాణానికి ఒక నిశ్శబ్ద గుర్తింపును ఇచ్చాయి. భారతీయ సినిమా నిజాయితీగా, మూలాలను మరవకుండా బలంగా ఉండేలా చేసే మీలాంటి గొంతుకలు ఉన్నందుకు నేను కృతజ్ఞుడిని. ఇద్దరు దర్శకులు, వేర్వేరు మార్గాలు అయినా మన దేశం కోసం ఒక బలమైన సినిమాను, ఒక సాహసోపేతమైన భవిష్యత్తును నిర్మించే దిశగా మనం సోదరుల్లా కలిసి నడుస్తున్నాం. సినిమా ఎప్పుడూ ధైర్యవంతులనే గుర్తుంచుకుంటుంది, అందరినీ మెప్పించే వారిని కాదు.” అంటూ తన మార్క్ స్వీట్ రిప్లైని సందీప్ విషయంలో పంచుకున్నాడు.
సందీప్ హేటర్స్ కి ట్విస్ట్..
ధురంధర్ వచ్చిన తర్వాత చాలామంది బాలీవుడ్ జనం సోషల్ మీడియాలో సందీప్ రెడ్డి వంగపై గట్టిగానే తమ విషం కక్కారు. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే సందీప్ రెడ్డి వంగ నడుస్తున్న దారి తరహాలోనే తాను కూడా ఉన్నాను అంటూ ఆదిత్య ధర్ చెప్పడం ఆ హేటర్స్ అందరికీ ఒక ఊహించని ట్విస్ట్ అనే చెప్పి తీరాలి.
DHURANDHAR is built like a man who doesn’t talk much & carries a masculine spine…. DHURANDHAR The title fits because the film moves with dominance & fierce. The depiction is very clear with zero chaos. Music, performances, screenplay & direction are on the top. #AkshayKhanna…
— Sandeep Reddy Vanga (@imvangasandeep) December 20, 2025


