‘పొట్టేల్’ టీజర్ లాంచ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్ గా సందీప్ రెడ్డి వంగా

‘పొట్టేల్’ టీజర్ లాంచ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్ గా సందీప్ రెడ్డి వంగా

Published on Apr 17, 2024 9:01 PM IST

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ళ హీరో హీరోయిన్స్ గా యువ దర్శకుడు సాహిత్ మోతుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పొట్టేల్.

ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన మూడు సాంగ్స్ అందరినీ ఆకట్టుకుని మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. విషయం ఏమిటంటే, రేపు ఈ మూవీ యొక్క టీజర్ ని సాయంత్రం 5 గం. 18 ని. లకు హైదరాబాద్ లోని ఏఏఏ సినిమాస్ లో గ్రాండ్ ఈవెంట్ ద్వారా లాంచ్ చేయనుండగా దీనికి చీఫ్ గెస్ట్ గా అనిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా విచ్చేసి టీజర్ ని లాంచ్ చేయనున్నారు.

నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌ బ్యానర్ పై సురేష్ కుమార్ సడిగే ఈ మూవీని గ్రాండ్ గా నిర్మించారు. శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చిన ఈ మూవీ విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు