“యానిమాల్ పార్క్” సెట్స్ మీదకి వెళ్ళేది అప్పుడే!

“యానిమాల్ పార్క్” సెట్స్ మీదకి వెళ్ళేది అప్పుడే!

Published on Dec 8, 2023 9:00 PM IST


యానిమల్ ఈ సంవత్సరం అతిపెద్ద హిట్‌లలో ఒకటి. బాక్సాఫీస్ వద్ద జోరుగా దూసుకుపోతోంది. రణబీర్ కపూర్ మరియు రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ డ్రామాకి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. సినిమాకి సీక్వెల్ యానిమల్ పార్ట్ 2 ఉంటుందని, సినిమా ముగిసే సమయానికి మేకర్స్ విషయాన్ని ప్రకటించారు. యానిమల్ పార్క్ అనే టైటిల్ తో ఈ చిత్రం కొనసాగుతుంది. ఈ వార్త అభిమానులను పెద్ద సంతోష పరిచింది.

అయితే యానిమల్ పార్క్ సెట్స్ మీదకి వెళ్ళడానికి చాలా సమయం పడుతుందని వార్తలు వస్తున్నాయి. 2026లో ప్రభాస్ మరియు అల్లు అర్జున్‌లతో తన చిత్రాలను పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఈ చిత్రం రూపొందుతుందని సందీప్ రెడ్డి వంగా స్వయంగా ధృవీకరించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు