క్రేజీ డైరెక్టర్ తో మహేష్ – తమన్నా !

Published on Mar 16, 2021 2:00 pm IST

సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు, ‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటించబోతునట్లు ఇటీవలె వార్తలు వచ్చాయి. కాకపోతే, వీరి కలయికలో వచ్చేది సినిమా కాదు. ఒక యాడ్ ఫిల్మ్. ప్రముఖ ఎలక్ట్రికల్ మరియు గృహోపకరణాల బ్రాండ్ హావెల్స్‌ కోసం వీళ్ళు యాడ్ చేస్తున్నారు. ఈ యాడ్ కోసం మహేష్ అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అన్నట్టు స్టార్ హీరోయిన్ తమన్నా కూడా ఈ యాడ్ ఫిల్మ్‌లో భాగం కానుంది. ఈ రోజు షూటింగ్ జరుగుతుంది. పైగా ఇది ఒకే రోజులో యాడ్ పూర్తీ కానుంది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. దర్శకుడు పరుశు రామ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :