పవన్ కోసం రాయల్ గర్ల్ గా మారిన సంజన

pawan-kalyan-sanjana
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వేరే పనులను పక్కన పెట్టి అనుకున్న టైంకి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ రిలీజ్ చేయాలని శరవేగంగా షూటింగ్ ని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఇటీవలే గుజరాత్ షెడ్యూల్ పూర్తి చేసుకొని వచ్చిన పవన్ త్వరలోనే హైదరబాద్ లో మరో షెడ్యూల్ ని మొదలు పెట్టనున్నాడు. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో లక్ష్మీ రాయ్ ఓ పాటలోనే ఓ కీ రోల్లో కనిపించనుంది. తను కాకుండా సంజనని కూడా ‘సర్దార్ గబ్బర్ సింగ్’లో ఓ ముఖ్యమైన పాత్ర కోసం ఎంపిక చేసారని ఇదివరకే తెలియజేశాం.

సంజన సర్దార్ లో తన రోల్ ఎలా ఉంటుందా అనేదానిపై స్పందిస్తూ ‘ఈ సినిమాలో నేను ఒక రాయల్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిలా కనిపిస్తాను. రాజుల కాలం నాటి శారీస్ తో, భారీగా నగలు పెట్టుకొని మునుపెన్నడూ కనిపించని లుక్ లో కనిపిస్తాను. ఈ వారంలోనే షూట్ లో జాయిన్ కానున్నాను. నాకు సోలో గానే కాకుండా పవన్ కళ్యాణ్ తో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. ఆయనతో కలిసి చేయడం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని’ సంజన తెలిపింది. పవర్ ఫేం బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని శరత్ మరార్ నిర్మిస్తున్నాడు. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా సమ్మర్ కానుకగా మేలో రిలీజ్ కానుంది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్.

Exit mobile version