సంజయ్ దత్ కి 5సంవత్సరాలు జైలు శిక్ష.!

సంజయ్ దత్ కి 5సంవత్సరాలు జైలు శిక్ష.!

Published on Mar 21, 2013 12:10 PM IST

Sanjai-Dutt
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ రోజు షాకింగ్ న్యూస్ విన్నాడు. ఈయనపై 1993లో నమోదైన అక్రమ ఆయుదాలను కలిగి ఉన్నాడనే కేసులో సుప్రీం కోర్టు ఈ రోజు తీర్పును తెలియజేసింది.ఈ కేసులో సుప్రీం కోర్టు ఈయనకు కాస్త ఊరట కలిగించిందనే చెప్పుకోవాలి ఎందుకంటే కింది కోర్టు విదించిన 6సంవత్సరాల జైలు శిక్షను 5సంవత్సరాలు చేసింది. ఇంతకు ముందే సంజయ్ దత్ 18 నెలలు జైలు శిక్షను అనుభవించాడు. ప్రస్తుతం బెయిల్ పై వున్నాడు. ఈయను జైలులో లొంగి పోవడానికి కోర్టు 4వారాల వ్యవదిని ఇచ్చింది.

ప్రస్తుతం సంజయ్ దత్ చాలా సినిమాలో నటిస్తున్నాడు. సంజయ్ దత్ నటిస్తున్న బాలీవుడ్ సినిమా నిర్మాతకు ఈ విషయం ఒక పెద్ద షాకింగ్ న్యూసే. కాని రామ్ చరణ్ ‘జంజీర్’ సినిమాకి మాత్రం ఎక్కువగా ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ సినిమా వర్క్ దాదాపుగా ముగిసింది. కోర్టు 4 వారాలు గడువు ఇవ్వడంతో నిర్మాతలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. సంజయ్ దత్ శిక్ష విషయంలో ఇదే చివరి తీర్పా లేక న్యాయ పరంగా మళ్ళీ అప్పీలు చేసుకోవచ్చా అన్న విషయం ఇంకా తెలియలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు