సంజయ్ దత్ కొత్త సినిమాకి కోన వెంకట్ స్క్రిప్ట్

సంజయ్ దత్ కొత్త సినిమాకి కోన వెంకట్ స్క్రిప్ట్

Published on Nov 23, 2011 4:16 AM IST


కోన వెంకట్ బాలీవుడ్లో అడుగుపెట్టేందుకు కొంచెం ఆలస్యంగానైనా గట్టిగానే రంగం సిద్ధమైంది. ఈ మద్య కాలంలో వరుసగా మూడు ప్రాజెక్టులు చేయబోతున్న మొదటి తెలుగు రచయిత వెంకట్ మాత్రమే. ప్రస్తుతం ఆయన ఢీ హిందీ వెర్షన్ కు, నో ఎంట్రీ-2 మరియు షేర్ ఖాన్ చిత్రాలకు స్క్రిప్టును అందిస్తున్నారు. ఢీ హిందీ వెర్షన్ లో సంజయ్ దత్ శ్రీహరి చేసిన పాత్రను పోషించనున్నారు.

ఈ చిత్ర స్క్రిప్ట్ చూసి మెచ్చుకున్న సంజయ్ దత్ తను నటించబోయే కొత్త చిత్రం కోసం మరో స్క్రిప్ట్ చేసి పెట్టమని అడిగారని ఆయన సంజయ్ దత్ కోసం ఒక సరి కొత్త స్క్రిప్టును సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సంజయ్ దత్ ముఖ్య పాత్ర పోషించనున్న ఈ చిత్రానికి ఆయన భార్య మాన్యత నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు